కేవలం వారి కోసమే ఆస్ట్రియాలో మళ్లీ లాక్ డౌన్!
- ఆస్ట్రియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- వ్యాక్సిన్ తీసుకోని వారికి లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
- టీకా తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ అందరికీ కాదు. కేవలం వ్యాక్సిన్ తీసుకోని వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.