మహేశ్ మేనల్లుడి 'హీరో' రిలీజ్ డేట్ ఖరారు!
- అశోక్ గల్లా నుంచి 'హీరో'
- కథానాయికగా నిధి అగర్వాల్
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
- జనవరి 26వ తేదీన విడుదల
జనవరి 26వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. జనవరిలో ప్లాన్ చేసుకున్న కొన్ని పెద్ద సినిమాలు ఫిబ్రవరికి .. ఏప్రిల్ కి వెళ్లి పోయాయి. అలాంటిది 'హీరో' చాలా ధైర్యంగా ఈ డేట్ ను ఖరారు చేసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ చూస్తుంటే, యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. జిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. వెన్నెల కిషోర్ .. బ్రహ్మాజీ కనిపించనున్నారు
.