ఆ సమయంలో ఎన్టీఆర్ ఎంతో ధైర్యం చెప్పాడు: శివరాజ్ కుమార్
- పునీత్ రాజ్ కుమార్ ఇటీవల హఠాన్మరణం
- తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన శివరాజ్ కుమార్
- ఎన్టీఆర్ తమకు తమ్ముడి లాంటి వాడని వెల్లడి
- తమ కుటుంబంతో అనుబంధం ఉందని వివరణ
"అన్నా మీకు నేనున్నాను అంటూ అండగా నిలిచాడు. తీరని శోకంలో ఉన్న మాకు ఎంతో ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో ఓ తమ్ముడిలా అనిపించాడు. మా కుటుంబంతో ఎన్టీఆర్ కు ఎంతో సాన్నిహిత్యం ఉంది" అని వివరించారు. కాగా, పునీత్ కు నివాళులు అర్పించే సమయంలో శివరాజ్ కుమార్... ఎన్టీఆర్ ను హత్తుకుని కన్నీటిపర్యంతం కావడం మీడియాలో కనిపించింది.