పిల్లల్ని ఎందుకు కనలేదన్న ప్రశ్నకు ఉపాసన ఘాటుగా సమాధానం
- పిల్లల్ని ఎప్పుడు కనాలన్నది నా వ్యక్తిగత విషయం
- నాకంటూ కొన్ని హద్దులు గీసుకున్నాను
- సామాజిక మాధ్యమాల్లోనూ చర్చించుకుంటున్నారు
- నేను మాట్లాడితే ఏదేదో రాసేస్తుంటారు
అలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, దీనిపై తాను ఏం మాట్లాడినా అది మీడియాలో సంచలనం అవుతుందని, ఏదేదో రాసేస్తుంటారని ఉపాసన వ్యాఖ్యానించారు. అయితే, ఎవరేమైనా అనుకోనివచ్చని, తాను మాత్రం దీనికి సమాధానం చెప్పనని ఆమె స్పష్టం చేశారు. దీనిపై ఎవరు ఏమనుకున్నా తనకు అభ్యంతరం లేదని అన్నారామె. అయితే, సమయం వచ్చినప్పుడు మాత్రం శుభవార్త అందరికీ చెబుతానని నవ్వుతూ చెప్పారు.