దేశ స్వాతంత్ర్యంపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు!
- 1947లో మనకు వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదన్న కంగన
- కాంగ్రెస్ హయాంలో కూడా బ్రిటీష్ పాలనే కొనసాగిందని వ్యాఖ్య
- మోదీ వచ్చిన తర్వాతే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న కంగన
కాంగ్రెస్ హయాంలో కూడా బ్రిటీష్ పాలనే కొనసాగిందని ఆమె చెప్పారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా? లేక దేశద్రోహంగా భావించాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగింది. దేశ స్వాతంత్ర్యాన్ని అవమానించిన ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ డిమాండ్ చేశారు. కంగనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ కోరారు.