'ఆర్ ఆర్ ఆర్' మూడో సాంగ్ కి ముహూర్తం కుదిరినట్టే!
- 'ఆర్ ఆర్ ఆర్' నుంచి పెరుగుతున్న అప్ డేట్లు
- రీసెంట్ గా వచ్చిన 'నాటు నాటు' సాంగ్
- 18వ తేదీన మూడో సాంగ్ రిలీజ్
- జనవరి 7వ తేదీన విడుదల
కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'నాటు .. నాటు' అనే పాటను వదిలారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట, రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నెల 18వ తేదీన మూడవ సాంగ్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఇక వరుసగా ఒక్కో ఆయుధాన్ని వదులుతున్నారన్న మాట.