ముఖ్యమైన పాత్రలను పరిచయం చేసిన 'గని' టీమ్!
- వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని'
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 15వ తేదీన టీజర్ రిలీజ్
- డిసెంబర్ 3వ తేదీన సినిమా విడుదల
ఇటీవలే ఈ సినిమా షూటింగు పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నెల 15వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న ఆర్టిస్టుల పేర్లను ఈ సినిమా టీమ్ ఆవిష్కరించింది. ఆ జాబితాలో నదియా .. సీనియర్ నరేశ్ .. తనికెళ్ల భరణి .. నవీన్ చంద్ర .. సునీల్ శెట్టి .. జగపతిబాబు .. ఉపేంద్ర పేర్లు కనిపిస్తున్నాయి.