పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఏమాత్రం లేదు: ఏపీ మంత్రి బుగ్గన
- కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదు
- రాష్ట్రానికి ఉండే ఖర్చులు, కేంద్రానికి ఉండే ఖర్చులు వేర్వేరు
- పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ ద్వారానే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది
ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పెట్రో ధరలను తగ్గించే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. పెట్రో ధరలను తగ్గించేందుకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదని చెప్పారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరని, కేంద్రానికి ఉండే ఖర్చులు వేరని అన్నారు. రాష్ట్రానికి పెట్రో ఉత్పత్తులు, ఎక్సైజ్ ద్వారానే ఆదాయం వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రం నిర్ణయం తీసుకోలేదని అన్నారు.