పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం
- పెట్రో ధరల తగ్గింపునకు చర్యలు
- పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5 వ్యాట్ తగ్గించిన పంజాబ్
- తమకు రూ.900 కోట్ల నష్టం వస్తుందన్న పంజాబ్ మంత్రి
- ఇప్పటికే వ్యాట్ తగ్గించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు
ఇటీవలే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం... వినియోగదారులకు ఊరట కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించారు. ఇతర రాష్ట్రాల్లోనూ చమురు ధరలు తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల నిర్ణయంతో ఇతర రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరిగింది.