భయపెడుతున్న 'మంగళం శ్రీను'.. 'పుష్ప' సినిమా నుంచి సునీల్ గెటప్ పోస్టర్ విడుదల
- మునుప్పెన్నడూ చూడని విధంగా సునీల్ లుక్
- ఎర్రని కళ్లు, చేతికి ఉంగరాలతో నటుడు
- విలన్ పాత్రలో కనపడనున్న సునీల్?
భయంకరంగా ఆయన కనపడుతోన్న తీరు చూస్తోంటే ఈ సినిమాలో సునీల్.. ఈ సినిమా ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ లా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్రల్లో నటించాలని ఉందని గతంలోనూ సునీల్ చాలా సార్లు చెప్పాడు.
డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన 'దాక్కో దాక్కో మేక'.. 'శ్రీవల్లి' పాటలు అలరించాయి. ఈ సినిమా పోస్టర్లు కూడా 'పుష్ప'పై అంచనాలు పెంచేస్తున్నాయి.