'లక్ష్య' లిరికల్ సాంగ్ రిలీజ్!
- విలువిద్య నేపథ్యంలో సాగే కథ
- నాగశౌర్య తండ్రి పాత్రలో జగపతిబాబు
- ఎమోషనల్ గా సాగిన సాంగ్
- నాగశౌర్య సరసన కేతిక శర్మ
నారాయణ్ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాలో, నాగశౌర్య జోడీగా కేతిక అందాల సందడి చేయనుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "అరచేతుల్లో దాచి .. వెలిగించే దీపం తానే, కనుపాపల్లే కాచి .. నడిపించే లోకం తానే" అంటూ ఈ పాట సాగుతోంది.
తండ్రీకొడుకుల ప్రేమానురాగాలకి ప్రతీకగా నిలిచే ఈ పాటను నాగశౌర్య - జగపతిబాబుపై మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు. కాలభైరవ స్వరపరిచిన ఈ పాటకి రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా, హైమత్ మహ్మద్ ఆలపించాడు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.