Prabhas: మరో మూడు రోజుల్లో 'రాధే శ్యామ్' ఫస్టు సింగిల్?

Radhe Shyam movie update

  • ప్రభాస్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
  • విదేశీ నేపథ్యంలో నడిచే కథ
  • పునర్జన్మలతో ముడిపడిన కథ
  • జనవరి 14న విడుదల

ప్రభాస్ కథానాయకుడిగా 'రాధేశ్యామ్' రూపొందింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, టి - సిరీస్, యూవీ క్రియేషన్స్ వారు భారీస్థాయిలో నిర్మించారు. జనవరి 14వ తేదీన 7 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ రోజు కోసమే ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రానున్న ఫస్టు సింగిల్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ రానుందనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఆ రోజున వస్తుందని అంటున్నారు.

ఇది ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథ .. పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథ. ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడం కోసం కోట్ల రూపాయలను గుమ్మరించారు. విదేశాల్లోను .. భారీ సెట్లలోనూ చిత్రీకరణ జరిపారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News