వైజాగ్ లో ఈ నెల 7న గ్రాండ్ గా 'పుష్పక విమానం' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఆనంద్ దేవరకొండ హీరోగా పుష్పక విమానం
- కథానాయికలుగా శాన్వి మేఘన, గీత్ సైనీ
- దామోదర దర్శకత్వం
- ఈ నెల 12న రిలీజ్
- ఈ నెల 10న ఏవీడీ సినిమాస్ లో ప్రీమియర్ షో
హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ కోసం ప్రమోషనల్ ఈవెంట్స్ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నెల 10న మహబూబ్ నగర్ లోని తమ సొంత థియేటర్ ఏవీడీ సినిమాస్ లో 'పుష్పక విమానం' ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండగా, ఈ షోకు విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. 'పుష్పక విమానం' థియేట్రికల్ ట్రైలర్ ను ఇటీవలే 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ ఆవిష్కరించడం తెలిసిందే. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.