'ఆచార్య' నుంచి నీలాంబరి లిరికల్ సాంగ్ రిలీజ్!
- 'ఆచార్య' నుంచి సెకండ్ సింగిల్
- మణిశర్మ స్వరకల్పన
- అనంత శ్రీరామ్ సాహిత్యం
- శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ
- ఫిబ్రవరి 4వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాలో సిద్ధ పాత్రలో చరణ్ .. నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే మరో జోడీగా కనిపించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సాంగ్ ను సెకండ్ సింగిల్ గా కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి' అంటూ ఈ పాట సాగుతోంది.
మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి - రమ్య బెహ్రా ఆలపించారు. ఫొటోగ్రఫీ .. కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. సాంగ్ మేకింగ్ వీడియోతో కలిపి అందించిన సెకండ్ సింగిల్ ఆకట్టుకునేలా ఉంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.