సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- శ్రుతిహాసన్ కి మైత్రీ మూవీస్ స్వాగతం!
- పారితోషికాన్ని పెంచేసిన సమంత
- ఆది సాయికుమార్ 'బ్లాక్' సిద్ధం
* నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక కథానాయిక సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టి, పలు కొత్త ప్రాజక్టులను ఒప్పుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా తన పారితోషికాన్ని బాగా పెంచినట్టు తెలుస్తోంది. ఒక్కో సినిమాకి ఆమె సుమారు 3 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.
* ఆది సాయికుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్లాక్' చిత్రం నిర్మాణం పూర్తయింది. దీంతో చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్టుగా పేర్కొంటూ చిత్ర నిర్మాతలు తాజగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. దర్శన బానిక్ ఇందులో కథానాయికగా నటించింది.