అప్పుడు సారా తాగా.. ఇప్పుడు కాస్త మంచి విస్కీ తాగుతున్నా: బాలయ్య 'అన్ స్టాపబుల్' లో మోహన్ బాబు
- బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
- ఆహా ఓటీటీలో ప్రసారం
- ప్రారంభ ఎపిసోడ్ కు విచ్చేసిన మోహన్ బాబు
- ఆసక్తికర అంశాలు పంచుకున్న వైనం
మద్రాసులో కెరీర్ ఆరంభించిన రోజుల్లో తాను సారా తాగేవాడ్నని వెల్లడించారు. కోడంబాకం బ్రిడ్జి కింద కొన్ని సారా దుకాణాలు ఉండేవని, ఓ స్నేహితుడితో కలిసి వెళ్లి తాగేవాడ్నని తెలిపారు. కెరీర్ ఆశాజనకంగా లేని రోజుల్లోనూ తాగానని అన్నారు. ఇప్పుడు దేవుడు తనకు మంచి జీవితాన్ని ఇచ్చాడని, దాంతో కాస్త మంచి విస్కీ తాగుతున్నానని మోహన్ బాబు పేర్కొన్నారు.