మూడు నెలలు పూర్తిగా ఫామ్ లోనే గడిపేశాం: మధుమిత
- 2009లో ప్రేమ వివాహం చేసుకున్న శివ బాలాజీ, మధుమిత
- అన్యోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జంట
- తమ పెళ్లికి మధు కుటుంబం తొలుత ఒప్పుకోలేదన్న శివ బాలాజీ
తనకు కోపం ఎక్కువని మధుమిత తనను పెళ్లిచేసుకోవడానికి ఆమె కుటుంబసభ్యులు తొలుత ఒప్పుకోలేదని... ఇప్పుడు తనను వారు పూర్తిగా అర్థం చేసుకున్నారని బాలాజీ చెప్పాడు. పెళ్లైన కొత్తలో ప్రతి దానికీ గొడవ పడేవాళ్లమని... ఆ తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకున్నామని మధు తెలిపింది.
ఇక పప్పుచారు దగ్గర నుంచి పాయా వరకు అన్ని వంటలను మధు అద్భుతంగా వండుతుందని బాలాజీ కితాబునిచ్చాడు. కరోనా టైమ్ లో మూడు నెలల పాటు పూర్తిగా ఫామ్ లోనే గడిపేశామని మధు తెలిపింది. తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టమని... మధు ఫ్యామిలీకి కూడా అదే ఇష్టమని బాలాజీ అన్నాడు. అందరూ దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలని ఇద్దరూ కోరారు.