ఇక కారులో కూర్చునే సినిమాను చూసేయచ్చు.. ముంబైలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ రెడీ!
- 17.5 ఎకరాల్లో విస్తరించిన జియో వరల్డ్ డ్రైవ్
- 290 కార్ల సామర్థ్యం
- దేశంలోనే తొలి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ థియేటర్
- ఈ నెల 5న ప్రారంభం
వాణిజ్య రాజధాని అయిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 17.5 ఎకరాల విస్తీర్ణంలో జియో వరల్డ్ డ్రైవ్ ఉంది. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లు మాత్రమే లభ్యమవుతాయి. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. ఆధునిక వినియోగదారుల షాపింగ్‌ను మరింత అద్భుతమైన అనుభవంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నుంచే జియో వరల్డ్ పుట్టుకొచ్చిందని చెప్పారు.