పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు.. తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంత్యక్రియలు
- తెల్లవారుజాము ఐదు గంటలకు ప్రారంభమైన అంతిమ యాత్ర
- కంఠీరవ స్డేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు సాగిన యాత్ర
- పునీత్ మృతదేహానికి సెల్యూట్ చేసిన కర్ణాటక సీఎం
కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. పునీత్ పార్థివ దేహానికి సెల్యూట్ చేశారు. తాను ఎత్తుకుని ఆడించిన తన సోదరుడు పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శివరాజ్ కుమార్ రోదించారు. పునీత్ భార్య అశ్విన్, ఇద్దరు పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.