Rajamouli: రాజమౌళి సినిమాకి నిర్మాతగా దిల్ రాజు!

Rajamouli and Mahesh Babu movie update

  • భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన దిల్ రాజు
  • సెట్స్ పైకి వెళ్లిన శంకర్ - చరణ్ ప్రాజెక్టు
  • షూటింగుకి రెడీగా విజయ్ - వంశీ పైడిపల్లి సినిమా
  • ఇక రాజమౌళి సినిమాతో మరో సాహసం  

దిల్ రాజు ఎప్పుడూ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఉంటారు. అయితే ఈ సారి ఆయన భారీ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. శంకర్ - చరణ్ కాంబినేషన్లో ఆయన పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది.

ఇక త్వరలో ఆయన వంశీ పైడిపల్లి - విజయ్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సెట్స్ పై ఉన్న విజయ్ సినిమా షూటింగు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు  మొదలవుతుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమను విడుదల చేయనున్నారు.

ఇక తాజాగా రాజమౌళి తదుపరి సినిమాకి కూడా దిల్ రాజు ఒక నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నట్టు చెప్పుకుంటున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా, భారీతారాగణంతో కూడిన వందల కోట్ల బడ్జెట్ సినిమానే. మరో నిర్మాతగా అందువల్లనే దిల్ రాజు ఉండనున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News