సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- చిరంజీవి సినిమాకి తమన్నా ఖరారు
- దీపావళి తర్వాత మహేశ్ షూటింగ్
- పెళ్లికి సిద్ధమవుతున్న కత్రినా కైఫ్
* మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ దీపావళి వెళ్లిన తర్వాత హైదరాబాదులో మొదలవుతుంది. ఆ షెడ్యూలుతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. కాగా, ఇటీవల ఈ చిత్రం కోసం స్పెయిన్లో కొన్ని సన్నివేశాలను, ఓ పాటను చిత్రీకరించారు. దీనికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
* బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో గత కొంతకాలంగా ఆమె ప్రేమలో ఉంది. ఇక వీరిద్దరూ ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోనున్నట్టు తాజాగా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.