విధి చాలా క్రూరమైనది... ఇది చనిపోవాల్సిన వయసు కాదు: పునీత్ మృతిపై ప్రధాని మోదీ స్పందన
- కన్నడ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ మృతి
- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వైనం
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ
- ప్రతిభావంతుడైన నటుడు దూరమయ్యాడని వెల్లడి
రాబోయే తరాలు పునీత్ సినిమాలను, ఆయన నటనను, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని తప్పకుండా గుర్తుచేసుకుంటాయని వివరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తీవ్ర సంతాపం తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ దంపతులతో కలిసి ఉన్నప్పటి ఫొటోను మోదీ ట్విట్టర్ లో పంచుకున్నారు.