గుండెపోటుకు గురైన కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్... పరిస్థితి విషమం!
- ఈ ఉదయం ఛాతీలో నొప్పితో విలవిల్లాడిన పునీత్
- బెంగళూరు విక్రమ్ ఆసుపత్రికి తరలింపు
- ప్రస్తుతం ఐసీయూలో చికిత్స
- హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్న కర్ణాటక సీఎం
పునీత్ ఆసుపత్రిపాలైన విషయం తెలుసుకుని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పునీత్ వయసు 46 సంవత్సరాలు. దివంగత మహానటుడు రాజ్ కుమార్ తనయుల్లో ఒకడైన పునీత్ కన్నడ నాట అగ్రహీరోగా గుర్తింపు పొందారు.