మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమాపణలు: దర్శకుడు అజయ్ భూపతి
- బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన 'మహా సముద్రం'
- ఇలాంటి సినిమా ఎందుకు తీశావన్నా? అని ప్రశ్నించిన నెటిజన్
- త్వరలోనే మంచి కథతో వస్తానని సమాధానమిచ్చిన అజయ్
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అజయ్ భూపతిని ట్యాగ్ చేస్తూ... 'మహా సముద్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం. ఎందుకు అలా తీశావ్ అన్నా?' అని ప్రశ్నించాడు. దీనిపై అజయ్ స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. మీ అంచనాలను అందుకోలేకపోయానని... త్వరలోనే అందరినీ సంతృప్తిపరిచే మంచి కథతో ముందుకు వస్తానని సమాధానమిచ్చారు.