దీపావళికి 'భీమ్లా నాయక్' నుంచి టీజర్!
- ముగింపు దశలో 'భీమ్లా నాయక్'
- రానా జోడీగా సంయుక్త మీనన్
- మాస్ అంశాలతో రానున్న టీజర్
- జనవరి 12న సినిమా రిలీజ్
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన పవన్, రానా పాత్రల తాలూకు వీడియోస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్లోని పాటను వదిలిన విషయం తెలిసిందే. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
మాస్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ను రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఈ టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. గట్టిపోటీ మధ్య బరిలోకి దిగుతున్న ఈ సినిమా, కొత్త రికార్డులను కొల్లగొడుతుందేమో చూడాలి.