ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్'
- సుధీర్ బాబు, ఆనంది జంటగా తెరకెక్కిన 'శ్రీదేవి సోడా సెంటర్'
- ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై విజయం సాధించిన చిత్రం
- నవంబర్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్
ఈ చిత్రానికి 'పలాస 1978' చిత్రాన్ని తెరకెక్కించిన కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నరేశ్, రఘుబాబు, అజయ్, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఓటీటీలో విడుదలవుతున్న సందర్భంగా సినిమా ట్రైలర్ కట్ ను జీ5 విడుదల చేసింది.