థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఆనంద్ దేవరకొండ "పుష్పక విమానం"
- నవంబర్ 12న విడుదల అవుతున్న "పుష్పక విమానం"
- ఈ నెల 30న రిలీజ్ కానున్న ట్రైలర్
- ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన విజయ్ దేవరకొండ
ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా "పుష్పక విమానం" సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నెల 30న "పుష్పక విమానం" ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తుండటంతో... అభిమానులకు బాగా రీచ్ అవుతోంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రానికి సమర్పకుడిగా కూడా వ్యవహరించారు. సాన్వీ మేఘన, గీతా సైనీ, సునీల్, నరేశ్, హర్షవర్ధన్, గిరిధర్, కిరీటి, వైవా హర్ష, అభిజిత్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు.