సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సోషల్ మీడియాలో కాజల్ క్రేజ్
- ఎన్టీఆర్ సినిమాకి సెట్ సిద్ధం
- రాజమండ్రిలో శర్వా, రష్మిక
* ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందే భారీ చిత్రానికి సంబంధించిన భారీ సెట్ నిర్మాణం పూర్తయింది. జూబ్లీ హిల్స్ లో ఎన్టీఆర్ ఇంటికి సమీపంలోనే ఈ సెట్ ను వేయడం జరిగింది. త్వరలోనే ఈ చిత్రం షూటింగును ప్రారంభిస్తారు.
* శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి రాజమండ్రిలో జరుగుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ షెడ్యూలులో ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు.