ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరు: మంత్రి బాలినేని
- ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏం చేస్తారు?
- ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదు
- దేవుడులాంటి ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించారు
టీడీపీ కార్యాలయాన్ని దేవాలయం అని చెప్పుకునే చంద్రబాబు... ఆ పార్టీని ప్రారంభించిన దేవుడు ఎన్టీఆర్ ను చెప్పులతో ఎందుకు కొట్టించారని బాలినేని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చరిత్ర గురించి చెపుతుంటే వినేందుకు తమకు అసహ్యం కలుగుతోందని అన్నారు. ఢిల్లీలో చంద్రబాబును పలకరించే వారే లేరని ఎద్దేవా చేశారు.