అందుకే పట్టాభి బూతులు మాట్లాడారు: ఏపీ మంత్రి బాలినేని
- చంద్రబాబు చేస్తోన్న దీక్ష దొంగ దీక్ష
- కుట్రలకు పాల్పడతామంటే ఊరుకోం
- పట్టాభి వాడిన భాషను చంద్రబాబు సమర్థిస్తారా?
- చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అలా మాట్లాడారు
పట్టాభి వాడిన భాషను చంద్రబాబు సమర్థిస్తారా? అని ఆయన నిలదీశారు. గతంలోనూ టీడీపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరిపారని, దేవుడి రథాలు తగలబెట్టించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు జీవితమంతా కుట్రలమయమని ఆయన విమర్శించారు.