టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
- వికెట్లు తీసే సామర్థ్యం అతడికి లేదు
- పొట్టి ఫార్మాట్‌కు అతడు పనికిరాడు
- ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు అతడు భారమే తప్ప మరోటి కాదు
- నేనైతే అతడికి జట్టులో స్థానమే ఇవ్వను
టెస్టుల్లో అద్భుతమైన బౌలర్ అయిన అశ్విన్ ఇంగ్లండ్ సిరీస్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు అవసరం. అశ్విన్ బంతి అందుకున్నాడు. తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి మూడో బంతికి షకీబ్‌ను వెనక్కి పంపాడు. నాలుగో బంతికి అక్షర్ దొరికిపోయాడు. అయితే, ఐదో బంతిని త్రిపాఠి స్టాండ్స్‌లోకి పంపి కోల్‌కతాకు తిరుగులేని విజయాన్ని అందించాడు.