ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా!
- ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి
- తీర్పును 20కి వాయిదా వేసిన కోర్టు
- బెయిల్ ఇవ్వొద్దని వాదించిన ఎన్సీబీ
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 20న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. దీంతో, అప్పటి వరకు ఆర్యన్ జైల్లోనే ఉండనున్నాడు. మరోవైపు, ఆర్యన్ కు డ్రగ్స్ వాడే అలవాటు ఎప్పటి నుంచో ఉందని కోర్టులో ఎన్సీబీ వాదించింది. ఆర్యన్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది.