'శ్యామ్ సింగ రాయ్'లో వాసు పాత్రలో నాని!
- విభిన్నమైన కథాకథనాలు
- విలక్షణమైన పాత్రలో నాని
- ముగ్గురు కథానాయికల సందడి
- డిసెంబర్లో థియేటర్లకు
ప్రధాన కథానాయికగా సాయిపల్లవి కనిపించనుండగా, మరో రెండు పాత్రల్లో కృతిశెట్టి .. మడొన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలో నాని పాత్రను పరిచయం చేస్తూ ఒక మోషన్ పోస్టర్ ను వదిలారు. అది అమ్మవారి నేపథ్యంలోనిది కావడం విశేషం.
మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారా? లేక ఓటీటీలో వదులుతారా? అనే విషయంలో అంతా క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిసెంబర్లో థియేటర్లకు రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు.
.