తండ్రితో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లిన మంచు విష్ణు
- బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను
- మా ఎన్నికల్లో మొదటి నుంచి బాలకృష్ణ సహకరించారు
- ఇప్పటికే పలువురిని కలిశాను
- పెద్దలు అందరినీ కలుస్తాను
'మా' ఎన్నికల్లో మొదటి నుంచి బాలకృష్ణ సహకరించారని మంచు విష్ణు తెలిపాడు. ఇప్పటికే తాను కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజు, పరుచూరి బ్రదర్స్ లాంటి వారిని కలిశానని చెప్పాడు. ఇప్పుడు బాలయ్యను కలిశానని వివరించారు. పెద్దలందర్నీ కలుస్తానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపాడు. కాగా, ఆయన నిన్న 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.