శ్రియ ప్రెగ్నెన్సీపై మంచు లక్ష్మి స్పందన
- ఇటీవలే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన శ్రియ
- శుభాకాంక్షలు తెలియజేసిన మంచు లక్ష్మి
- ఆడ బిడ్డకు జన్మనివ్వడం గొప్ప విషయమని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి స్పందిస్తూ... ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నానంటూ శ్రియకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయమని చెప్పారు. గర్భవతివి అయ్యావని ప్రపంచానికి తెలియజేయడం అనేది నీ వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించారు. నీకు భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు.