నాకు మా అమ్మే అన్నీ... అమ్మను కించపరిచేలా మోహన్ బాబు బూతులు తిట్టారు: తనీశ్ ఆవేదన
- ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మీడియా సమావేశం
- మోహన్ బాబు దారుణంగా తిట్టారన్న తనీశ్
- చాలా బాధ కలిగిందని వెల్లడి
- తన వల్ల బెనర్జీ కూడా మాటలు పడ్డాడని వివరణ
- బెనర్జీకి క్షమాపణలు
తాను ఇలా ఏ రోజూ మీడియా ముందుకు వచ్చింది లేదని, వివాదాలకు తాను దూరమని స్పష్టం చేశారు. ఇవాళ తాను మా ఈసీ మెంబర్ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తనకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని తనీశ్ వెల్లడించారు. ఇక నా వల్ల బెనర్జీ కూడా మాటలు పడ్డారని, ఆయనకు క్షమాపణలు తెలుపుతున్నానని వివరించారు. మంచు విష్ణు, మనోజ్ తనకు ఎంతో కావాల్సిన వారని, కానీ ప్రకాశ్ రాజ్ ఆలోచనలు నచ్చడం వల్లే ఆయన ప్యానెల్ నుంచి పోటీ చేశానని స్పష్టం చేశారు.