తన కుమారుడు మంచు విష్ణు విజయం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మోహన్ బాబు
- మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం
- హర్షం వ్యక్తం చేసిన మోహన్ బాబు
- తనను రెచ్చగొట్టాలని చూశారని వెల్లడి
- కానీ ఓపిక పట్టానని వివరణ
తాను 17 ఏళ్ల కిందట మా అధ్యక్షుడిగా చేశానని, ఇప్పుడు తన బిడ్డ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడని అన్నారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే... నాలుగు అడుగులు వేగంగా ముందుకు దూకుతుంది అని అర్థమని వ్యాఖ్యానించారు.
మా నూతన కార్యవర్గం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి, సినీ రంగ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాలని మోహన్ బాబు సూచించారు. గతంలో సీఎంలను సన్మానించేవాళ్లమని, ఇప్పుడు కూడా ఆ ఆనవాయతీని పాటించి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సన్మానించాలని సూచించారు.