నేను గెలిచి ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధగా ఉంది: శ్రీకాంత్
- 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమి
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన శ్రీకాంత్
- విష్ణుకు అభినందనలు తెలిపిన వైనం
- జయాపజయాలను సినిమాతో పోల్చిన శ్రీకాంత్
'మా' కోసం తాము ఎంతో చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నామని, గత రెండు నెలలుగా తాము కలిసి ప్రయాణించామని పేర్కొన్నారు. తమ బృందం మా పీఠం ఎక్కలేకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయమని అన్నారు. ఇది కూడా ఓ సినిమా అనుకుని వెళ్లిపోవడమేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు.