'మనుచరిత్ర' నుంచి టీజర్ రిలీజ్!
- తెరపైకి మరో ప్రేమకథ
- ఎమోషన్ తో కూడిన యాక్షన్
- కథానాయికగా మేఘ ఆకాశ్
- త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ సినిమాతో భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు పెంచేదిలానే అనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
కొంతకాలం క్రితమే తెలుగు తెరకి పరిచయమైన శివ కందుకూరి, సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను ఆశించిన బ్రేక్ ఈ సినిమాతో లభిస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఇటీవల రెండు హిట్లు అందుకున్న మేఘ ఆకాశ్ ఈ సినిమాకి ప్లస్ కానుంది.