వెంకటేశ్ హీరోగా క్రిష్ మూవీ?
- రేపు విడుదల కానున్న 'కొండ పొలం'
- ఆ తరువాత పవన్ సినిమాపైనే దృష్టి
- అడవి నేపథ్యంలోని మరో కథపై ఆసక్తి
- నవల ఆధారంగా నిర్మితం కానున్న సినిమా
ఈ సినిమా తరువాత వెంకటేశ్ హీరోగా క్రిష్ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ కథ కూడా అడవి నేపథ్యంలోనే సాగనుంది. డాక్టర్ కేశవరెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ కథ కూడా అడవి .. దానికి సమీపంలోని గూడెంతో ముడిపడి సాగుతుంది.
గతంలో క్రిష్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 'కొండ పొలం' కథకి వస్తున్న రెస్పాన్స్ చూసిన తరువాత, క్రిష్ 'అతడు అడవిని జయించాడు' కథపై దృష్టి పెట్టాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.