డబ్బింగ్ పనులు పూర్తిచేసిన 'మహా సముద్రం'
- అజయ్ భూపతి 'మహా సముద్రం'
- లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ కి పెద్దపీట
- చైతన్ భరద్వాజ్ సంగీతానికి మంచి రెస్పాన్స్
- ఈ నెల 14వ తేదీన విడుదల
ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ .. సిద్ధార్థ్ సరసన అదితీరావు నటించారు. ఇక జగపతిబాబు .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషించారు. 'గరుడ' రామ్ పోషించిన పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అజయ్ భూపతి మొదటి చిత్రంగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సూపర్ హిట్ గా నిలిచింది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ ను ఆవిష్కరించడంలో ఆయన తనదైన మార్క్ చూపించాడు. ఇక ఇప్పుడు యాక్షన్ ను కూడా జోడించి ఆయన అందిస్తున్న 'మహా సముద్రం' ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.