నా ఊరిలో ఉనికిని కోల్పోవడం చూస్తే కన్నీళ్లొస్తున్నాయి: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి
- వైసీపీ నేతలు లంచాలు అడుగుతున్నారు
- కొందరు నేతల వల్ల తన కుటుంబం పరువు పోయింది
- అవినీతి పనులు చేస్తే తాట తీస్తా
కొందరు వైసీపీ నేతల వల్ల పార్టీ పరువు, తన కుటుంబం పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కంచుకోటగా తయారు చేసిన తన మండలం, తన ఊరిలో తమ ఉనికిని కోల్పోవడాన్ని చూసి కన్నీళ్లొస్తున్నాయని అన్నారు. ఓపెనింగ్ కార్యక్రమాలకు పిలిచినా డబ్బులు డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇంకోసారి అవినీతి పనులు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.