బద్వేల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ సమావేశం
- పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ
- వచ్చే నెల 30న ఉప ఎన్నిక
- వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా దాసరి సుధ
బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మంగళవారమే ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 8 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 2న ఫలితాన్ని వెల్లడిస్తారు. కాగా, టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.