దుమ్మురేపేస్తున్న 'లవ్ స్టోరీ' .. 5 రోజుల వసూళ్లు!
- నైజామ్ లో 10.08 కోట్ల షేర్
- తెలుగు రాష్ట్రాల్లో 21.18 కోట్ల షేర్
- ప్రపంచవ్యాప్తంగా 26.66 కోట్ల షేర్
- వసూళ్ల పరంగా తగ్గని జోరు
నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ సినిమాకి, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి 5 రోజుల్లో ఒక్క నైజామ్ లోనే 10.08 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలిపి 21.18 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26.66 కోట్ల షేర్ ను .. 46.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా? లేదా? అనే ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ఈ సినిమా ఇంకా అదే జోరును కొనసాగిస్తూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది.