సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రూమర్లపై స్పందించిన సమంత
- విజయ్ తమిళ సినిమాలో నాని?
- అఖిల్ సినిమా సెన్సార్ పూర్తి
* తమిళ స్టార్ హీరో విజయ్ నటించే సినిమాలో నేచురల్ స్టార్ నాని విలన్ గా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో విలన్ పాత్రలో నాని నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగును అక్టోబర్ 15న ప్రారంభిస్తారు.
* అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి దీనికి U/A సర్టిఫికెట్ లభించింది. కాగా, అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.