'లక్ష్య' రిలీజ్ డేట్ ఖరారు .. అధికారిక పోస్టర్ విడుదల!
- విలువిద్య నేపథ్యంలో నడిచే కథ
- నాగశౌర్య జోడీగా కేతిక శర్మ
- సంగీత దర్శకుడిగా కాలభైరవ
- నవంబర్ 12వ తేదీన విడుదల
ఇక ఆ తరువాత సినిమాగా 'లక్ష్య' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇది విలువిద్యకి సంబంధించిన కథ .. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కథ. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. నాగశౌర్య జోడీగా కేతిక శర్మ నటించగా, ఒక కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు
.