కాబోయే భర్తతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న నయనతార
- విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న నయనతార
- త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రేమ జంట
- వీఐపీ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్న జంట
ఆలయం నుంచి బయటకు వచ్చిన నయనతారను చూడటానికి భక్తులు ఉత్సాహం చూపించారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు యత్నించారు. ప్రస్తుతం ఆమె లయన్, పట్టు, ఆటో జానీ, త్రిష్ణ, గోల్డ్ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈరోజు వెంకన్నను దర్శించుకున్నారు.