సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్
- సాయితేజ్ హీరోగా 'రిపబ్లిక్'
- అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
- ఈ నెల 25న ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఇటీవలే ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి
- ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్
తన మేనల్లుడు ఆసుపత్రిలో ఉండడంతో, అతడు నటించిన సినిమాను మరింతగా ప్రమోట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా 'రిపబ్లిక్' చిత్రం ట్రైలర్ విడుదల చేసి మేనల్లుడి చిత్రానికి తనవంతు ప్రచారం కల్పించారు. దేవా కట్టా దర్శకత్వంలో వస్తున్న 'రిపబ్లిక్' చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు.