విజయ్ దేవరకొండ సొంత మల్టీప్లెక్స్ ఎలా ఉందో చూశారా...?
- మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్
- ఏవీడీ పేరిట థియేటర్ కాంప్లెక్స్
- మల్టీప్లెక్స్ కు యజయానిని అయ్యానంటూ విజయ్ వెల్లడి
- ఈ నెల 24న ప్రారంభం
దీని వివరాలను విజయ్ దేవరకొండ ఓ వీడియో రూపంలో వెల్లడించారు. సినిమా నటుడ్ని అవ్వాలన్నది తన కల అని, అక్కడ్నించి ఇవాళ తాను ఓ మల్టీప్లెక్స్ కు యజమానిని అయ్యానని తెలిపారు. ఈ మల్టీప్లెక్స్ సెప్టెంబరు 24న ప్రారంభం కానుందని, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రాన్ని తొలిగా ప్రదర్శిస్తామని విజయ్ దేవరకొండ వివరించారు.