డ్రగ్స్ కేసులో నటుడు తనీష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ
- టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ
- మనీలాండరింగ్ కోణంలో విచారణ
- నేడు ఈడీ ఎదుట హాజరైన తనీష్
- తనీష్ ను 7 గంటలపాటు విచారించిన అధికారులు
డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో పరిచయాలపైనా, ఎఫ్ క్లబ్ లో జరిగే ప్రత్యేక పార్టీల గురించి తనీష్ ను అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటిదాకా పూరీ జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి, నవదీప్, రానా, ముమైత్ ఖాన్ తదితరులను ప్రశ్నించింది.